Friday, January 3, 2025

ప్రేమపెళ్లి… భర్త ఇంటి ముందు ప్రియురాలు ధర్నా….

- Advertisement -
- Advertisement -

Wife strike for husband in warangal

వరంగల్: ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు…. 15 రోజులు కాపురం చేసి వదిలి పెట్టేయడంతో భర్త ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేసిన సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బట్టుతండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బాదావత్ అనిల్ కుమార్ అనే యువకుడు స్రవంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అమ్మాయి అతడిని నమ్మింది. జనవరిలో అనిల్ ను స్రవంతి ప్రేమ వివాహం చేసుకుంది. 15 రోజులు కాపురం చేసిన తరువాత వద్దు అనడంతో ఏం చేయాలో తెలియక తన భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. తన భర్త కావాలని ఆయన ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News