Tuesday, January 21, 2025

ప్రేమ పెళ్లి…. భర్త కనిపించడం లేదని అత్తింటి ముందు భార్య ధర్నా

- Advertisement -
- Advertisement -

Wife strike for Husband missing in chitturu

అమరావతి: ప్రేమి పెళ్లి… మూడు రోజుల నుంచి భర్త కనిపించకపోవడంతో భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో జరిగింది. భర్త కుటుంబ సభ్యులు కూడా ప్రియురాలు కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా చింతలపల్లె మండలం కుడిమేకు గ్రామానికి చెందిన మహ్మద్ సనా(23) ఈసెట్ కోచింగ్ తీసుకుంటుండగా రమేష్ కుమార్ పరిచయమయ్యాడు. దీంతో పరిచయం ప్రేమగా మారడంతో హిందూ సంప్రదాయం ప్రకారం మదనపల్లిలో జనవరి 4న వారు పెళ్లి చేసుకున్నారు. రమేష్ తన ఇంటికి మహ్మద్ సనాను తీసుకెళ్లాడు. అత్తింటి వారు ఆమెను వేధించడంతో మధనపల్లిలో ఏస్టేట్ లో అద్దె ఇల్లు తీసుకున్నారు. బయటకు వెళ్లి వస్తానని చెప్పిన రమేష్ మూడు రోజుల తరువాత కూడా రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో సనా ఫిర్యాదు చేసింది. స్థానిక వైసిపి లీడర్లతో రమేష్ కుటుంబ సభ్యులు తనని బెదిరిస్తున్నారని ఆమె ఆరోఫణలు చేసింది. దీంతో అత్తింటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. తమ కుమారుడిని సనా కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని రమేష్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News