భువనేశ్వర్: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో భర్తపై ఆమె బంధువులు దాడి చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం నవరంగ్ పూర్ జిల్లా రాయిఘర్ సమితి కచరాపర-2 గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 15 సంవత్సరాల క్రితం మనోరంజన్ కు జయంతికి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. భార్య విషం తాగి వాంతులు చేసుకుంటుండగా భర్త ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జయంత్రి తండ్రి హిరెన్ మండల్ తన బంధువులతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నాడు. తన కూతురు ఆత్మహత్యాయత్నానికి అల్లుడే కారణమని అతడిపై బంధువులు, మామ దాడి చేశాడు. వెంటనే అతడిని నవరంగపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ పరిస్థితికి కారణమని పోలీసులు, బంధువుల, గ్రామస్థులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.