Saturday, December 21, 2024

భార్య ప్రాణాలు తీసిన భర్త వివాహేతర సంబంధం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పచ్చటి సంసారంలో వివాహేతర సంబంధం నిప్పులు పోసింది. భర్త మరో మహిళతో వివాహేతరసంబంధం పెట్టుకున్నాడని టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని రామ్మూర్తి నగర్ రిచర్డ్ గార్డెన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అభిషేక్- శ్వేతాకు సంవత్సరం క్రితం పెళ్లి జరిగింది. దంపతులు సాప్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. కావలిసినంత జీతం ఉండడంతో విలాసవంతమైన జీవిత గడుపుతున్నారు. కానీ అభిషేక్‌కు పెళ్లికి ముందు మరో అమ్మాయితో వివాహేతరసంబంధం ఉంది. దీంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇరు కుటుంబ సభ్యుల పంచాయతీ పెట్టారు. పెద్ద మనుషుల సమక్షంలో భార్యతో కలిసి సంసారం చేస్తానని అభిషేక్ ఒప్పుకున్నాడు. అభిషేక్‌లో మార్పు రాకపోవడంతో చావే శరణ్యం అనుకుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి ఆమె ఉరేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్వేత తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అల్లుడిపై ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News