Saturday, December 21, 2024

భర్తను హత్య చేయించిన భార్య

- Advertisement -
- Advertisement -

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను దగ్గరుండి భార్య హత్య చేయించిన ఘనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణానికి గౌతంపూర్ కాలనీకి చెందిన రమేష్ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సాహు ఈశ్వర్ కుమార్ భార్య ఎండి రెహనాతో రమేష్ అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఈశ్వర్ కుమార్ కు తెలియడంతో రమేష్ ను ప్రాంతం నుండి ఇల్లు ఖాళీ చేయించాడు. ఈ క్రమంలో ఈశ్వర్ కుమార్ తన భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు.ఈ విషయాన్ని రెహనా తన ప్రియుడు రమేష్ కి చెప్పి ఎలాగైన తన భర్త అడ్డు తొలగించుకొవాలని కోరింది.

దీంతో రమేష్, అతడి అల్లుడు చందు, భార్య ఇందిర కత్తులతో ఈశ్వర్ కుమార్ పై దాడి చేశారు. ఆ సమయంలో రెహనా ఇంటి ముందు కాపలా కాసింది .త్రీవంగా గాయపడిన ఈశ్వర్ కుమార్ ను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. కుటువబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈశ్యర్ కుమార్ భార్య రెహనా పై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. నలుగురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News