Wednesday, January 22, 2025

ప్రియుడితో భర్తను చంపించిన భార్య

- Advertisement -
- Advertisement -

Husband suicide with lover elope

అమరావతి: ప్రియుడితో భర్తను భార్య చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో జరిగింది. భర్త ఫోన్‌లో సిమ్ పడేసి భార్య తన సిమ్ వేయడంతో పోలీసులకు దొరికిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హిర మండలం మేజర్ పంచాయతీకి చెందిన సుజాత గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన కుంబిర రాజును 17 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. సుజాతకు పాడలి గ్రామానికి చెందిన గురల్లా రాముతో వివాహేతర సంబంధం ఉంది. హైదరాబాద్‌కు వచ్చిన తరువాత పలుమార్లు ఆమె ఫోన్‌లో ప్రియుడితో మాట్లాడింది.

దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని భార్య నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలలో రాజు సొంతూరు వెళ్తున్న విషయాన్ని ప్రియుడికి సమాచారం ఇచ్చింది. ఎలాగైన రాజును హత్య చేయాలని ప్రియుడితో కలిసి ప్రణాళిక వేసింది. రాము, ఆటోడ్రైవర్ నూకరాజు సహాయం తీసుకొని రాజు వద్దకు వెళ్లారు. రాము, రాజు, నూకరాజుకు గతంలో పరిచయం ఉండడంతో ముగ్గురు కలిసి మద్యం తాగాడానికి వంశధార నది గట్టు వైపు వెళ్లారు. రాజుకు మద్యం ఫుల్‌గా తాగించి ఆటోలో ఉన్న తాడుతో గొంతుకు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని అక్కడే ఉన్న చెట్ల పొదల్లో వేశారు. ఇదే విషయాన్ని ప్రియురాలుకు చెప్పడంతో మృతదేహాన్ని తగలబెట్టాలని సూచించింది.

వెంటనే అతడు వెళ్లి మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తన భర్త కనిపించడంలేదని బంధువులకు, గ్రామస్థులకు సమాచారం ఇచ్చింది. హైదరాబాద్ నుంచి గ్రామానికి వెళ్లి హిరమండలం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడి ఫోన్ నందర్ ఆధారంగా దర్యాప్తు చేశారు. భర్త ఫోన్ నుంచి సిమ్ తీసి మరో సిమ్ వేసినట్టు ఈఎంఐ నంబర్ ఆధారంగా గుర్తించారు. భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా ప్రియుడితో తన భర్తను హత్య చేయించానని ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News