Sunday, January 19, 2025

జాతీయ జెండా సాక్షిగా భార్య గొంతు కోసి….

- Advertisement -
- Advertisement -

husband who cut his wife's throat with knife

కరీంనగర్: జాతీయ జెండా సాక్షిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గొంతు కోసిన సంఘటన కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 11 సంవత్సరాల క్రితం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం ప్రవీణ్, కేశవపట్నానికి చెందిన శిరీష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 9,8 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు. శిరీషా అంగన్ వాడీ ఆయాగా పని చేస్తుంది. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో కలహాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. సోమవారం అంగన్ వాడీ కేంద్రం వద్ద జాతీయ జెండా వందనం జరుగుతుండగా అతడు అక్కడికి చేరుకొని ఆమెను బయటకు లాక్కొచ్చి కత్తితో గొంతు కోశాడు. అడ్డుకోబోయిన యువకుడిని కూడా పొడిచాడు. ఆమె ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News