Tuesday, July 9, 2024

కజిరంగా పార్క్‌లో 77 వన్య ప్రాణులు మృతి

- Advertisement -
- Advertisement -

గువాహటి : సుప్రసిద్ధ కజిరంగా జాతీయ పార్కు లోపల ఇటీవలి సంవత్సరాల్లో అత్యంత అధ్వాన వరదల్లో 77 వన్య ప్రాణులు మరణించినట్లు, మరి 94 వన్య ప్రాణులను వరద నీటిలో నుంచి రక్షించినట్లు పార్కు అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. 77 వన్య ప్రాణులు నీటిలో మునక వల్ల లేదా చికిత్స సమయంలోను చనిపోయినట్లు ఆయన తెలిపారు. మరణించిన జంతువుల సంఖ్య గురువారం నాటి 31 నుంచి పెరిగింది.

పార్కులో వరద నీటిలో మునిగి మూడు ఖడ్గమృగాలు, 62 జింకలు, ఒక ఓట్టర్, చికిత్స సమయంలో 11 జంతువులు మరణించాయి. అటవీ అధికారులు 85 జింకలు, రెండు లేళ్లు, రెండు గుడ్లగూబలు, ఒక్కొక్క పిల్ల ఖడ్గమృగం, పిల్ల కుందేలు, పిల్ల ఓట్టర్, గున్న ఏనుగు, అడవి పిల్లి పిల్లను రక్షించారు. ప్రస్తుతతం 33 జంతువులు వైద్య చికిత్సలో ఉన్నాయి. మరి 50 జంతువులను చికిత్స అనంతరం పార్కులోకి వదలిపెట్టినట్లు అధికారి తెలియజేశారు. తూర్పు అస్సాం వన్యమృగ డివిజన్‌లోని 233 శిబిరాల్లోకి 75 శిబిరాలు శుక్రవారం కూడా జలార్ణవమై ఉన్నాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News