Wednesday, January 29, 2025

ద్విచక్ర వాహన దారులపై అడవి పందుల దాడి

- Advertisement -
- Advertisement -

బెజ్జూరుః బెజ్జూరు మండలంలోని లుంబినినగర్ గ్రామానికి చెందిన ఇప్ప జగదీష్, ఇప్ప సుమన్, శేఖర్‌లు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న క్రమంలో అడవి పందుల గుంపు ద్విచక్ర వాహనానికి తగలడంతో ముగ్గురు అదుపు తప్పి కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. సలుగుపల్లి నుండి లూంబినినగర్ వైపు వెళ్తుండగా కుంటలమానేపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై అడవిపందుల గుంపును చూసి భయందోళనతో ముగ్గురు ద్విచక్ర వాహనం నుండి కింద పడడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఇట్టి విషయం గమనించిన స్థానిక ప్రయాణికులు వెంటనే వారిని కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరళించారు. అడవి పందులు రాత్రనక పగలనక ప్రధాన రహదారి నుండి వెళ్లడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులు భయం భయంతో ప్రయాణం చేసే పరిస్థితిగా మారిందని ప్రయాణికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News