- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతం గాజులరామారంలోని కైసరనగర్ డబుల్ బెడ్ రూమ్ సమీపంలో అడవి పిల్లి కనిపించింది. అడవి పిల్లిని చిరుత పులి అనుకొని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డబుల్ బెడ్ రూమ్ కు సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో పలు అడవి జంతువుల సంరక్షణకు ఫారెస్ట్ అధికారులు కంచె వేశారు.
బుధవారం ఉదయం బుల్ బెడ్ రూంల సమీపంలోకి మచ్చలు గల పిల్లి కనిపించడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత పులి పోలికతో ఉండటంతో స్థానికులు కంగుతిన్నారు. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని అడవి పిల్లిని పట్టుకున్నారు. అది అడవి పిల్లి అని తేల్చడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వింతగా కనిపించిన పిల్లిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. అడవి పిల్లిని బోనులో బంధించి అటవీ శాఖ అధికారులు తీసుకెళ్లారు.
- Advertisement -