Sunday, November 17, 2024

ఒకరిని తొక్కి చంపిన ఏనుగు.. వయనాడ్‌లో నిరసనల వెల్లువ

- Advertisement -
- Advertisement -

వయనాడ్(కేరళ): కేరళ వయనాడ్‌లోని మనంతవాడిలో శనివారం ఒక అడవి ఏనుగు 42 ఏళ్ల వ్యక్తిని తొక్కి చంపడంతో వీధుల్లో జనం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అజి మృతదేహంతో జనం వీధులలో నిరసన ప్రదర్శనలు లేవదీశారు. శనివారం ఉదయం సుమారు 7.30 గంటలకు ఏనుగు దాడిలో గాయపడిన అజిని మనంతవాడి వైద్యకళాశాలలో చేర్పించగా, అతను అక్కడ మరణించాడు. అజి ప్రభృతులు అడవి ఏనుగు బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం, ఒక ఇంటి ఆవరణలోకి దూకడం సిసిటివి దృశ్యాలలో కనిపించింది. అయితే, ఆ ఏనుగు ప్రహరీ గోడను ధ్వంసం చేసి ఆ వ్యక్తి వెంటబడి తొక్కి చంపింది.

జిల్లా కలెక్టర్‌తో సహా జిల్లా ఉన్నతాధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక సమావేశంలో ఉండగా నిరసనకారులు కొందరు ఆ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లారు. ఆగ్రహోదగ్రులైన కొందరు నిరసనకారులు సబ్ కలెక్టర్ కార్యాలయం తలుపులు, గ్రిల్‌లను గట్టిగా మోదారు. స్థానికులు వీధులలో రాకపోకలను అడ్డుకోవడమే కాకుండా అజి శవాన్ని రోడు మధ్యలో ఉంచి నిరసన తెలియజేశారు. అంతకు ముందు కలెక్టర్, స్థానిక ఎంఎల్‌ఎ, జిల్లా పోలీస్ చీఫ్‌లను కూడా రోడ్డుపై నిలువరించి, ఆసుపత్రిని సందర్శించకుండా నిరోధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News