- Advertisement -
న్యూఢిల్లీ : అడవి లోని నీటి మడుగు నుంచి ప్లాస్టిక్ బాటిల్‌ను నోటితో పట్టుకుని పులి వస్తున్న దృశ్యం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కథికార్ ఈ అరుదైన సంఘటనను తన కెమెరాలో బంధించ గలిగారు. రామ్‌డేగి కొండల్లో భానుష్కిండి అనే పులి కూన ఈ విధంగా ప్లాస్టిక్ సీసాను పట్టుకు వస్తోందని ఫోటో గ్రాఫర్ వివరించారు. ఈ ఫోటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫిబ్రవరి 13 న షేర్ చేశారు. ‘పులి అందించిన మధుర సంకేతం’ అన్న శీర్షిక పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను దాదాపు 21 వేల మంది వీక్షించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అడవులను పరిశుభ్రం చేసుకోవాలన్న సందేశం వినిపించారు.
- Advertisement -