Wednesday, January 22, 2025

2 వేల నోటు మార్కెట్‌పై ప్రభావం చూపుతుందా?.. నిపుణులు ఏం చెబుతున్నారు?

- Advertisement -
- Advertisement -

రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై నిపుణులు ఏం చెబుతున్నారు?

న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం వల్ల స్టాక్ మార్కెట్‌పై ఏమైనా ప్రభావం ఉంటుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ వారంలో మార్కెట్ రూ. 2000 నోటు ఉపసంహరణ కొంతమేరకు ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బిఐ నిర్ణయంపై సమాజంలోని అన్ని వర్గాల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని చాలా మంది చెబుతుండగా, పెద్దనోట్ల రద్దు అంత ఘోరమైనదని పలువురు పేర్కొంటున్నారు.

తక్షణమే ఈ నోట్లను రద్దు చేయడంలేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రజలు ఇప్పటికీ ఈ నోట్లను లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు. స్టాక్ మార్కెట్‌పై ఈ నిర్ణయం ప్రభావం విషయానికి వస్తే, ఈ నిర్ణయం వల్ల పెద్దగా ప్రభావం ఉండదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 2016లో కనిపించిన డీమోనిటైజేషన్ ప్రభావం ఈసారి ఉండబోదని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ప్రజల వద్ద ఇప్పటికే చాలా తక్కువగా రూ. 2000 నోట్లు ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా యుపిఐ విధానంతో చెల్లింపులు పెరిగాయి. ఈ పరిస్థితిలో నోట్ల రద్దు తర్వాత నిత్యావసర వస్తువుల అమ్మకాలు ఒక్కసారిగా భారీ క్షీణతకు గురైనట్లుగా ఇప్పుడు ప్రజల వినియోగంపై ఎటువంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు.

ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్ కార్తీక్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, డీమోనిటైజేషన్ సమయంలో చూసినట్లుగా ఇది బ్యాంకుల్లో డిపాజిట్లను పెంచుతుందని భావిస్తున్నామని, ఇది సమీప భవిష్యత్తులో బ్యాంకుల డిపాజిట్లను మెరుగుపరుస్తుందని అన్నారు. ఇది డిపాజిట్ రేటు పెంపు ఒత్తిడిని తగ్గిస్తుంది. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను తగ్గించడానికి దారితీయవచ్చు. ఈ అంచనా సరైనదే అయితే వచ్చే రోజుల్లో బ్యాంకింగ్ స్టాక్స్ మంచి పనితీరును కనబరుస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News