Monday, December 23, 2024

రాహుల్ గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తా : నవజోత్ సింగ్‌సిద్ధూ

- Advertisement -
- Advertisement -

Will accept Rahul Gandhi's decision: Navjot Singh Sidhu

చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎవరిని ప్రకటించినా తాను స్వాగతిస్తానని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఓ న్యూస్‌ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో శనివారం సిద్ధూ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రాహుల్ గాంధీ నిర్ణయమే అంతిమమమని చెప్పారు. పరిస్థితులను మార్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పదవుల కోసం కాదని అన్నారు. పార్టీ అధిష్ఠానం కోరుకున్నదే తనకు ఆజ్ఞ అని చెప్పారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా, ప్రకటించక పోయినా , తుదిశ్వాస వరకు తాను కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News