Monday, December 23, 2024

అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తాం: మాణిక్ రావు థాక్రే

- Advertisement -
- Advertisement -
ప్రియాంక తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు
షర్మిల పార్టీలోకి వస్తే ఎపిలో కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం
బిఆర్‌ఎస్, బిజెపికి చెందిన కీలక నేతలు త్వరలో కాంగ్రెస్‌లోకి
ఢిల్లీలో మీడియా సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కాగా భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాలని కోరిన సంగతి విదితమే. ఈ క్రమంలో వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా థాక్రే చేసిన లేటేస్ట్ కామెంట్స్ కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. ఇక, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ వస్తోన్న వార్తలపై ఆయన రియాక్ట్ అయ్యారు. వైఎస్సార్‌టిపి చీఫ్ వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం టచ్‌లో ఉందని కొన్ని రోజులుగా వినిపిస్తోన్న వార్తలను థాక్రే కుండబద్దలు కొట్టారు. షర్మిల పార్టీలోకి వస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ హైకమాండ్ తదుపరి ఫోకస్ తెలంగాణపై పెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి కార్యచరణ త్వరలోనే సిద్ధమవుతోందని చెప్పారు. ఇక, బిఆర్‌ఎస్, బిజెపికి చెందిన కీలక నేతలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరూ అడ్డుకోలేరు

”బిఆర్‌ఎస్ నేతలు బిజెపి నేతలను కలుస్తున్నారు. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత వ్యవహారం నడుస్తోంది. కూటమి ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారని మాకు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్‌పై విశ్వాసం పెరుగుతోంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా ఎవరూ అడ్డుకోలేర’ని మాణిక్‌రావు థాక్రే స్పష్టీకరించారు.

విపక్షాల మీటింగ్ జరిగితే.. బిఆర్‌ఎస్ ఢిల్లీలోనా…!

బిహార్‌లోని పాట్నాలో విపక్షాల మీటంగ్ జరిగితే మరోవైపు దిల్లీలో బిఆర్‌ఎస్ నేతలు బిజెపితో మంతనాలు జరుపుతున్నారని మాణిక్‌రావు థాక్రే మండిపడ్డారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. 10 ఏళ్లు బిఆర్‌ఎస్ అధికారంలో ఉందని, ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారని మరోమారు పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News