Monday, December 23, 2024

ఈ నెల 31 నుంచి స్కూళ్లను తెరుస్తారా?: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. పాఠశాలల పున:ప్రారంభంపై హైకోర్టుకు తెలిపిన తెలంగాణ సర్కారు
వారాంతపు సంతల్లో నియంత్రణ చర్యలపై ప్రశ్నించిన ధర్మాసనం
సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
పిల్లల మందులు మెడికల్ కిట్లలో ఇవ్వలేమన్న డీహెచ్

DH Srinivasa Rao Submit Report To High Court On Covid Situation

హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసుల నియంత్రణపై ఇవాళ హైకోర్టులో విచారణ కొనసాగింది. వారాంతపు సంతల్లో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశాలిచ్చింది. ఈ నెల 31 నుంచి స్కూళ్లను తెరుస్తారా? అని హైకోర్టు ప్రశ్నించింది.

రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆన్ లైన్ లో విచారణకు హాజరయ్యారు. తెలంగాణ ఇప్పటివరకు 77 లక్షల ఇళ్లలో ఫీవర్ సర్వేలో 3.45 లక్షల మెడికల్ కిట్లను పంపిణీ చేశామని హైకోర్టుకు డిహెచ్ నివేదక ఇచ్చారు. పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందన్నారు. పిల్లలకు సంబంధించిన మందులను కిట్లలో నేరుగా ఇవ్వడానికి లేదని తెలియజేశారు. అయితే, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

రవణం వెంకటేశ్వర రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News