Wednesday, March 26, 2025

తర్వాతి మ్యాచ్‌లలో ఆ రికార్డు బద్దలుకొడతాం: ఇషాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిపోయిన ఇషాన్ కిషన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ సెంచరీతో సన్‌రైజర్స్ జట్టు 286 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. ఇది ఐపిఎల్‌లో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం.

అయితే ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ 287 పరుగులు కూడా సన్‌రైజర్స్ పేరిటే ఉంది. ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును బద్దలు కొడతారని అంతా అనుకున్నారు. కానీ, కొంత తేడాతో ఆ రికార్డు చేజారింది. అయితే మ్యాచ్‌ అనంతరం ఇషాన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మ్యాచుల్లో అత్యధిక స్కోర్ రికార్డును బద్దలుకొడతామని అన్నాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తనని దక్కించుకున్న వెంటనే అభిషేక్ శర్మకు ఫోన్ చేశానని.. ‘నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు. ప్రతి బంతిని బౌండరీ బాదాలా’ అని అడిగాను అని. దానికి సమాధానంగా అభిషేక్ అవును అదే పని చేయమని చెప్పాడని ఇషాన్ వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News