Monday, December 23, 2024

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి…

- Advertisement -
- Advertisement -

సోనియాకు బహుమతిని అందిస్తాం
జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిస్తా
సమర్ధవంతమైన పాలనను దేశ ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే
అధిష్టానం ఆదేశాల మేరకు కంటోన్మెంట్ నుంచి దరఖాస్తు చేసుకున్నా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ

మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సోనియాగాంధీకి బహుమతిగా అందచేస్తామని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి తాము బహుమతిని ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నారు. సర్వే సత్యనారాయణ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిస్తానన్నారు. తనకు ఇద్దరు తల్లులని ఆయన తెలిపారు. తన కన్న తల్లి తనకు జన్మనివ్వగా, రాజకీయంగా జన్మనిచ్చింది సోనియా గాంధీ అని, కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం, దేశంలో ప్రజల అభివృద్ధి జరిగిందన్నారు. ఒక సమర్ధవంతమైన పాలనను దేశ ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కంటోన్మెంట్ స్థానంలో తాను దరఖాస్తు చేశానన్నారు.

తనపై కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి షోకాజ్‌లు కానీ, సస్పెన్షన్ లు కానీ లేవన్నారు. అవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమేనన్నారు. ఉత్తమ్‌ను, కుంతీయ లాంటి వ్యక్తులను పదవుల నుంచి తొలగించే వరకు పార్టీకి దూరంగా ఉన్నానని, అది జరిగినందుకే వచ్చానన్నారు. అనంతరం ఇప్పుడు పార్టీ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. 1985,-89 సంవత్సరంలో తాను కంటోన్మెంట్‌లో పోటీ చేసి ఎమ్మెల్యే గా ప్రజలకు సేవలందించానని సర్వే తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తిరిగి అవకాశం ఇవ్వడంతో మళ్లీ కంటోన్మెంట్ నుంచి బరిలో నిలవబోతున్నానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News