Monday, January 13, 2025

కేంద్రానికి కేజ్రీవాల్ సవాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు పంపితే అన్ని ప్రభుత్వ పాఠశాలలను తాను నగరంలో నిర్మిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. శుక్రవారం మయూర్ విహార్ ఫేన్ 3లో ప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశంలో తానేదో కరడుగట్టిన ఉగ్రవాదిలా తన దర్యాప్తు సంస్థలన్నిటినీ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనపైకి ఉసిగొల్లుపతోందని ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన ఫిర్యాదు కేసుకు సంబంధించి ఫిబ్రవరి 17న కోర్టులో హాజరుకావాలని కేజ్రీవాల్‌ను సిటి కోర్టు ఆదేశించింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాటసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఇడి ఇడి జారీచేసిన ఐదు సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోలేదు. కాగా..పిల్లలకు నాణ్యమైన విద్యను అందచేయడం వల్ల పేదరికాన్ని నిర్మూలించవచ్చని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికే తన ప్రభుత్వం ఢిల్లీలో వరుసగా ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. గతంలో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యావ్యవస్థ అధ్వాన్నంగా ఉండేవని, పేద పిల్లలకు భవిష్యత్తు ఉండేది కాదని ఆయన చెప్పారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక అనేక ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త పాఠశాలలు అనేకం నిర్మించడం జరిగిందని ఆయన చెప్పారు.

దాదాపు లఖన్నర మంది పిల్లలు ఈ పాఠశాలలలో చదువుతున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుందని ఆయన చెప్పారు. పా స్కూళ్ల స్థానంలో కొత్త స్కూలు భవనాల నిర్మాణం జరుగుతోందని, కొత్త స్కూళ్లలో లేబొరేటరీలు, లైబ్రరీలు, లిఫ్టులు, యాక్టివిటీ రూములతోసహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉంటాయని ఆయన చెప్పారు. అందరికీ విద్య లభించాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని తాము నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. ఇంటి వద్దనే రేషన్ అందించాలని తాము రెండేళ్ల క్రితం ప్రతిపాదించగా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఈ ప్రతిపాదనకు కేంద్రం అభ్యంతరం తెలిపిందని, కాని శనివారం నుంచి పంజాబ్‌లో ఇంటివద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు.

పంజాబ్‌లో ఈ పథకాన్ని ప్రారంభించాక దీన్ని ఢిల్లీలో కూడా ఈన్ని ప్రారంభిస్తామని, అప్పుడు దీన్ని కేంద్రం ఎలా అడ్డుకుంటుందో చూస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదని, సగం రాష్ట్రమేనంటూ ఆప్ ప్రభుత్వం చేసే పనులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక అవరోధాలను కల్పించిందని ఆయన ఆరోపించారు. ఢఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రం చేయాలని తాను కేంద్రాన్ని కోరుతున్నానని ఆయన చెప్పారు. కేంద్రం ఏమీ చేయదు..తప్ను ఏమీ చేయనివ్వదు అంటూ ఆయన విమర్శించారు.

ఢిల్లీలో ప్రజలకు తాను ఉచిత విద్యుత్, ఆరోగ్యరక్షణ, విద్యను అందచేస్తున్నప్పటికీ బిజెపి మాత్రం తనను దొంగగా ముద్రించిందని ఆయన చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఈ సౌకర్యాలు ఖరీదేనవే కాక నాసిరకమైనవని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరిని దొంగ అనాలని ఆయన ప్రశిస్తూ ప్రజలకు ఉచితంగా అనేక సౌకర్యాలను కల్పిస్తున్న వ్యక్తినా లేక వీటిని కల్పించలేకపోయిన వ్యక్తినా అన్న విషయాన్ని ప్రజలే ఆలోచించాలని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News