Thursday, December 26, 2024

ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తాం

- Advertisement -
- Advertisement -

కొందరు సిఎంలు బెదిరిపులకు దిగుతున్నారు
తెలంగాణపై కేంద్రమంత్రి గోయల్ సంచలన వ్యాఖ్యలు

Will buy rice as per the agreement

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌సిఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార , పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు. శుక్రవారం రాజ్యసభ సమావేశాల్లో భాగాగం ప్రశ్నోత్తరాల సమయంలో ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని వెల్లడించారు. ఉప్పుడు బియ్యాన్ని ఇవ్వం అని రాష్ట్రాలు రాసి ఇచ్చాయన్నారు. ధాన్యం సేకరణ అంశంలో తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర మంత్రి గోయల్ సంచలన వ్యాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్ ఇవ్వమని రాతపూర్వకంగా ఇచ్చిందని , ఒప్పందం ప్రకారమే ముడి బియ్యం ఇస్తామని రాసిచ్చారని గోయల్ ఆరోపించారు. పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చాక నిర్దేశించుక్ను ధర మేరకు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద వాటిని ప్రజలకు పంపిణీ చేస్తుంటాయన్నారు.

పంజాబ్ , హరియాణా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి జరుగుతుందన్నారు. రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రతినిధులు ఇప్పటికే తమతో విస్తృతంగా చర్చలు జరిపారని తెలిపారు. కొందరు ముఖ్యమంత్రులు అయితే బెదిరింపులకు సైతం దిగారని ఆరోపించారు. ఇప్పడు కొత్తగా వడ్ల సేకరణ అంశాన్ని తెరపైకి తీసుకోచ్చారని , ధాన్యం సేకరణ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి ద్వారా దమ్కీలు ఇస్తున్నారని పరోక్షంగా ఆరోపణలు చేశారు. పంజాబ్ తరహాలో ధాన్యం కొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారని, పంజాబ్‌లో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారని తెలిపారు. అటువంటి బియ్యమే ఇవ్వాలని కోరామన్నారు. రైతులను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి గోయల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News