Sunday, November 17, 2024

అవసరమైతే వీల్‌చైర్ నుంచే ప్రచారం

- Advertisement -
- Advertisement -

 

ప్రశాంతంగా ఉండాలని కార్యకర్తలకు మమత పిలుపు
దీదీ కాలిమడమ ఎముకకు గాయం
ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
48 గంటలు పర్యవేక్షణ అవసరం : వైద్యులు

కోల్‌కతా: కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన పశ్చిమ బెం గాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు గురువారం ఉదయం బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఎడమ కాలు చీలమండ, పాదంలో తీవ్రమైన ఎముక గాయాలను గుర్తించినట్లు వెల్లడించారు. దీదీ కుడి భుజం, మెడకు కూడా గాయం అయినట్లు తెలిపారు. ఘటన జరిగిన తర్వాతినుంచి మమత ఛాతీలో నొ ప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతున్నా రని, 48గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యు లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే రక్తంలో సోడియం నిల్వలు తక్కువగా ఉన్నా యని తెలిపారు. ప్రస్తుతానికి ఆమె గట్టి అబ్జర్వేషన్‌లో ఉండనున్నట్లు ప్రభుత్వ ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రి డాక్టర్ ఒకరు తెలిపారు.

సాయంత్రం వైద్యులు మరోసారి సమా వేశమై పరిస్థితిని సమీక్షిస్తారని ఆయన చెప్పారు. గాయా లకు ఎలాంటి సర్జరీ అవసరం లేదని చెప్పారు. ముఖ్య మంత్రి ఎంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటందని అడిగిన ప్రశ్నకు వైద్యుడు సమాధానమిస్తూ, ఎంతకాలం అనేది చెప్పలేనని, ఆమె ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స చేస్తున్న వైద్యులు దాన్ని నిర్ణయిస్తారని తెలిపారు. కాగా గురువారం మధ్యాహ్నం దాకా వైద్యులు మమతకు ఎని మిది రకాల రక్త పరీక్షలు నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గా లు తెలిపారు.గాయం తీవ్రతను అంచనా వేయడానికి డాక్టర్లు ఆమెకు సిటి స్కాన్ సహా పలు రకాల వైద్య పరీక్ష లు నిర్వహించాలని అనుకుంటున్నారని కూడా ఆ వర్గా లు తెలిపాయి. మమత ఎడం కాలికి తాత్కాలికంగా ప్లా స్టర్ వేశారని, ఇసిజి నివేదిక బాగుందని, జ్వరం కూడా తగ్గిందని ఉద్యోగి ఒకరు తెలిపారు.

ప్రజలకు ఇబ్బంది కలగనివ్వొద్దు
నందిగ్రామ్‌లో మమతపై దాడి జరగడంతో ఆమె పార్టీ కార్యకర్తలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చే పట్టారు. ఈ నేపథ్యంలో నిరసనలపై స్పందించిన దీదీ.. ఆస్పత్రి బెడ్‌పైనుంచే పార్టీ కార్యకర్తలకు ఇచ్చా రు. ప్రజలకు ఇబ్బంది కలుగనివ్వొద్దని, శాంతియుతగా ఉండాలని కోరారు. అవసరమైతే వీల్‌చైర్‌లో కూర్చునే ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. ‘నిన్న సాయంత్రం కారు ఎక్కుతూ దేవుడ్ని ప్రార్థిస్తుండగా ఒక్కసారిగా కొం దరు నన్ను తోసేశారు. దీంతో నా ఎడమ కాలి మడమ ఎముకకు, పాదానికి, మోకాలికి గాయమైంది. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తోంది. ప్రస్తుతం వైద్యులు నాకు చికిత్స అందిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే డిశ్చార్జి అయి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. అవసరమైతే వీల్‌చైర్‌లో కూర్చుని ప్రచా రం చేస్తాను. అందుకు మీ అందరి సహకారం కావాలి. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయవద్దని, శాంతియుతంగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా’ అని మమత ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు
ఇదిలా ఉండగా మమతా బెనర్జీపై దాడి జరిగిన నంది గ్రామ్‌లోని బిరులియా బజార్ ప్రాంతాన్ని జిల్లా ఉన్న తాధికారులు గురువారం పరిశీలించారు. తూర్పు మిడ్న పూర్ జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) విభు గోయల్, జిల్లా ఎస్‌పి ప్రవీణ్ ప్రకాష్, ఇతర ఉన్నతాధికారులు ఘటన జరిగిన ప్రాంతాన్ని వివరాలు తెలుసుకున్నా రు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడడంతో పాటు సిసి టీవీలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించా రు. ప్రస్తుతానికి తమకు ఎలాంటి స్పష్టమైన ఫుటేజీ ల భించలేదని జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు. సంఘటన గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారని, వాళ్లంద రూ చెప్పేది వినిన తర్వాత ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పిస్తామని చెప్పారు. అధికారులు ఈరోజు సాయం త్రం ఇసికి నివేదిక సమర్పించవచ్చని తెలుస్తోంది.

మేనిఫెస్టో విడుదల వాయిదా
ఇదిలా ఉండగా మమతా బెనర్జీపై దాడి కారణంగా తృణ మూల్ కాంగ్రెస్ తమ మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసుకుంది. గురువారం మమత నివాసంలో ఈ మే నిఫెస్టోను విడుదల చేయాల్సి ఉండింది. కాగా మమత కోలుకున్న తర్వాతే విడుదల చేయడం జరుగుతుందని టిఎంసి సీనియర్ నాయకుడొకరు తెలిపారు.

నేడు టిఎంసి మౌన నిరసన
మరోవైపు తమ నాయకురాలు మమతా బెనర్జీపై జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం మౌన నిరసనలు నిర్వహి స్తామని తృణమూల్ కాంగ్రెస్ గురువారం ప్రకటించిం ది. శుక్రవారం సాయంత్రం 3 గంటలనుంచి 5 గంటల వరకు నల్లజెండాలు ఎగురవేసి, నోటికి నల్లగుడ్డలు కట్టు కుని మౌన ప్రదర్శనలు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీ చెప్పారు. ఇదిలా ఉండగా మమతపై దాడి ఘటనపై టిఎంసి ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేయనుంది.

ఆస్పత్రిని సందర్శించిన బిజెపి నేతలు
గురువారం ఉదయం బిజెపి నేతల బృందం మమతా బెనర్జీ చికిత్స పొందుతున్న ఆస్పత్రిని సందర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యుల సలహా మేరకు తాము దీదీని కలవలేకపోయామని ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల మాజీ గవర్నర్ తథాగత్ రాయ్ చెప్పారు. తమ ఆందోళనను అక్కడ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నేతలకు తెలియజేశామని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించామని ఆయన చెప్పారు.

కారు డోరు తగలడం వల్లే గాయాలు : ప్రత్యక్ష సాక్షులు

పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీపై దాడి జరిగిం దంటూ టిఎంసి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షలు మాత్రం దా నిని కొట్టిపడేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీ పంలోనే ఉన్న స్వీట్ షాప్ నిమై మైతి మాట్లాడుతూ ఈ ఘటన తన షాప్ ఎదురుగానే జరిగిందని, సాయం త్రం మమతా బెనర్జీ ఒక ఆలయం నుంచి మరొక ఆల యానికి వెళ్తున్న క్రమంలో వచ్చిన ఒక యూటర్న్ ద గ్గర సంఘటన చోటుచేసుకుందన్నారు. మమత వాహ నంలో నుంచి కొద్దిగా బయటకు వచ్చి, జనాలకు అ భివాదం తెలుపుతుండగా వాళ్లంతా ఒక్కసారిగా పరి గెత్తుకురావడంతో కారు డోరు ఆమె కాలికి తగిలి గా యం అయిందన్నారు.

ఆమె మీద ఎవరూ కావాలని దాడి చేయలేదని మైతి వివరించారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. దీదీని ఎవరు నెట్టలేదని, ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని వెల్ల డించింది. ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఏఎన్‌ఐ ఈ ప్రకటన చేసింది. అంతేకాక ఈ ఇద్దరు వ్యక్తులు తమకు ఏ రాజకీయ పార్టీతో సంబం ధం లేదని పేర్కొన్నారు. మమతను చూడడడానికి అభి మానులు ఎగబడడం వల్ల కారు డోరు తగిలి గాయ మైందని అని సుమన్ మైటీ అనే విద్యార్థి తెలిపాడు. మరో ప్రత్యక్ష సాక్షి దాస్ మాట్లాడుతూ ‘మమతా బెన ర్జీ దేవాలయాల సందర్శన నుంచి తిరిగి వచ్చేటప్పడు కారు తలుపు తెరిచి కూర్చుని ఉన్నారు. అందరూ ఆ మె దగ్గరి వెళ్లేందుకు దూసుకెళ్లడంతో ఆమె కాలికి తగిలి గాయలయ్యాయి’ అన్నారు.

Will campaign on wheelchair if necessary: Mamata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News