Thursday, January 23, 2025

నర్సింహస్వామి సాక్షిగా మాట ఇస్తున్నా: రూ.2 లక్షల రుణమాఫీపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు భయపడొద్దని.. మా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందన్నారు. ఆదివారం సాయంత్రం భువనగిరిలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేసే బాధ్యత తనదని.. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా మాట ఇస్తున్నానని తప్పకుండా రుణమాఫీ చేస్తానని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి వరి ధాన్యానికి రూ.500 బోనస్ కూడా ఇస్తామని తెలిపారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కెసిఆర్ పదే పదే అంటుండు.. ఇదేమైనా ఫుల్ బాటిలా.. పడిపోడానికి’ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతామని ఆయన హెచ్చరించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన బిజెపికి తెలంగాణలో ఓట్లు అడిగే అర్హతలేదన్నారు.

మూడు లక్షల మెజార్టీలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే గందమల్ల, బ్రాహ్మణ వెల్లెంల, బస్వాపూర్ ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత తనదని సిఎం అన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీ మురికి నుండి ప్రజలను విముక్తి చేస్తానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News