Monday, December 23, 2024

పోటీ చేస్తా

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి తుమ్మల స్పష్టీకరణ

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఖమ్మంలో బల ప్రదర్శన చేశారు. రానున్న ఎన్నికల్లో పాలేరు ఉంచి పోటీ చేయాలని భావించిన తుమ్మలకు బీఆర్‌ఎస్ అధిష్ఠానం టిక్కెట్ కేటాయించలేదు. ఈనేపథ్యంలో శుక్రవారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపు అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చేస్తుండటంతో ఆయన అభిమానులు, మద్దతుదారులు ఉమ్మడి జిల్లా న లుమూలల నుంచి భారీగా తరలివచ్చి సంఘీభా వం తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా సరిహ ద్దు అయిన కూసుమంచి మండలం నాయకన్‌గూడెం టోల్ ఫ్లాజా వద్దకు వేలాదిమంది అభిమానులు చేరుకొని ఆయనకు ఘనస్వాగతం పలికి తమ మద్దతును తెలిపారు. తీవ్ర జ్వరంతో, పంటి    నొప్పితో బాధపడుతున్న ఆయన హైద్రాబాద్‌లో తన నివాస గృహం నుంచి బయలుదేరే ముందు తనకు మద్దతుగా తన ఇంటి వద్దకు వచ్చిన వందలాది మంది కార్యకర్తలను చూసి భావోద్వేగానికిలోనై కంటనీరు పెట్టుకున్నారు.

ఆ తరువాత నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జాతీయ రహదారిపై గల ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం1.15 గం టల సమయంలో నాయకన్ గూడెంకు చేరుకున్న ఆయనకు పాలేరు నుంచి వాజేడు వరకు ఉమ్మడి జిల్లాలోని నలుమూలల నుంచి వేలాది మంది కా ర్యకర్తలు భారీగా తరలివచ్చి తమ సంఘీభావం తెలిపారు. దాదాపు రెండువేలకు పైగా కార్లు అక్కడికి చేరుకోవడంతో విశాలమైన టోల్‌ఫ్లాజా జనసంద్రాన్ని తలపించింది. ఉదయం 10గంటల నుంచే ఆయన రాకకోసం ఆయ న అభిమానులు టోల్ ఫ్లాజా వద్ద నిరీక్షించడం కన్పించింది.

ర్యాలీ అనంతరం గొల్లగూడెంలోని తన నివాస గృహం సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుమ్మల భావోద్వేగంతో మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను గెలిచినట్లయితే ఆ ఎన్నికతోనే తాను రాజకీయాలకు దూరం అయ్యేవాడినని, గోదావరి జలాలతో ఈ జిల్లా ప్రజల పాదాలను కడగడమే తన జీవిత ఆశయం అని, కాని గత ఎ న్నికల్లో అనివార్యంగా తాను ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా ప్రజల కోరిక మే రకు రానున్న ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. సెప్టెంబర్ 4న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకులు తుమ్మలకు టచ్‌లోకి వెళ్ళినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News