Friday, December 27, 2024

అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందా లేక మోడీ హ్యాట్రికా?

- Advertisement -
- Advertisement -

నేటి ఎగ్జిట్ పోల్స్ ఏమి చెప్పనున్నాయి

న్యూఢిల్లీ: నేడు యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఐపిఎస్ఓఎస్, పోల్ స్టార్ తదితర బడా పోల్ స్టర్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల సంఘం ఆంక్షలు(ఎంబార్గో) సాయంత్రం 6.30 వరకే ఉండనున్నాయి. తర్వాత వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ వివరాలను విడుదలచేస్తాయి.

లోక్ సభ ఎగ్జిట్ పోల్స్  డిబేట్స్ లో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పవన్ ఖేరా తెలిపారు. ‘టిఆర్ పి రేట్లు పెంచుకోడానికి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటారు కనుక తమకు వాటిపై ఆసక్తి లేదు’ అని ఆయన తెలిపారు.

బిజెపికి సరితూలరనే కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకుందని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. ఆయన ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. కాగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముమ్మరంగా ప్రచారం చేశారు.

ఏది ఏమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ను గుడ్డిగా నమ్మడానికి లేదు. అనేక సందర్భాలలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News