Tuesday, December 3, 2024

మెజారిటీతో అధికారాన్ని చేపడుతాం:రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రానున్నదని తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తుందని టిపిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి ఆత్మబలిదానానికి నేటి ఎన్నికల ఫలితాలకు సంబంధం ఉందన్నారు. ఆయన డిసెంబర్ 3న ఆత్మబలిదానానికి ప్రయత్నించి డిసెంబర్ 9 ఆయన శ్వాస విడిచారని తెలిపారు. అదే విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానున్నాయని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలిచినవాడు రాజు కారని, ఓడినవారు బానిసకారని గెలిచినవారు ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేసే వారని, ఓటమిపాలైనవారు ప్రతిపక్షంలో ప్రజల కోసం పాటు పడేవారని పాలకపక్షం, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బతికిబట్టకడుతుందన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ కేవలం 25స్థానాలకే పరితమవుతుందని జోష్యం చెప్పారు. తెలంగాణలో నిరంకుశ నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ కుటుంబం చేసిన అక్రమాలపైనే చర్యలు ఉంటాయన్నారు. తాము ఎవరిపై ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడమన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ఓడిపోతుందని తెలిసి కెసిఆర్ కాకుండా కెటిఆర్ మీడియాకు ముందు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు కుల, మతాలకు అతీతంగా ప్రజారంజక పాలన అందిస్తామని రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మాజి అరికెల నర్సారెడ్డి, ఉమ్మడి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News