Saturday, December 21, 2024

హైకమాండ్ ఆదేశిస్తే ఎంపిగా పోటీ చేస్తా : ఎమ్మెల్యే రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైకమాండ్ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన హామీలు ఎలా అమలు చేస్తారో సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు ఇటలీ నుండి తెస్తారా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి తెస్తారో సమాధానం చెప్పాలన్నారు. తమ పార్టీ శాసనసభ పక్షనేత ఎంపిక పార్టీ నిర్ణయిస్తుందని, సమర్దవంతమైన వారికే బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. ఎవరిని ఎంపిక చేసినా 8 మంది ఎమ్మెల్యేలను కలిసిమెలిసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటే అని కీలక వ్యాఖ్యలు చేస్తూ అక్బరుద్దీన్ ముందు తాము ఎమ్మెల్యేగా ప్రమాణం చేయమని చెప్పామని ఆ మాటకు కట్టుబడి ఉండి స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రమాణం చేశామని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన గ్యారెoటీలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తోందని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News