Saturday, November 23, 2024

పూర్నియా నుంచే పోటీ చేస్తా: పప్పు యాదవ్

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్లోని పూర్నియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈ వారం చివరిలో నామినేషన్ పత్రాలు దాకలు చేస్తానని మాజీ ఎంపి రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ సోమవారం ప్రకటించారు. ఈ సీటును కాంగ్రెస్‌కు వదిలిపెట్టాలని ఆయన ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను అర్థించారు. పక్షం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన పప్పు యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలియచేశారు. ఆర్‌జెడి అభ్యర్థిగా బీమా భారతి మంగళవారం ఇదే స్థానం నుంచి నామినేషన్ వేయనున్నారు.

తాను నామినేషన్ ప్రతాలను దాఖలు చేసే సమయంలో తనతో కలసి నడవాలని దేశవ్యాప్తంగా స్థిరపడిన పుర్నియావాసులు అనేక మంది అడుగుతున్నారని, వారి సౌలభ్యం కోసం తన నామినేషన్ ప్రతాల దాఖలు తేదీని ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశానని తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన పప్పు యాదవ్ తెలిపారు. బీహ౪ఆర్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు ఆర్‌జెడి కాని కాంగ్రెస్ కాని ఇంతవరకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు.అయితే ఏప్రిల్ 19న మొదటి దశలో జరగనున్న రాష్ట్రంలోని 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతే ఆర్‌జెడి, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారైంది. జెడియు నుంచి ఆర్‌జెడిలోకి ఫిరాయించిన బీమా భారతి తనకు పూర్నియా సీటును లాలూ ప్రసాద్ ఖరారు చేసినట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News