Thursday, January 23, 2025

సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా: కె.ఎ.పాల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ. పాల్ ప్రకటించారు. తనను ప్రజలు గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతానని అన్నారు. నాలుగైదు రోజులుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు తనను ఆదరించాలని కోరుతూ నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్‌లోని పలుకాలనీల్లో తిరిగారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి  తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నానని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని హామీలిస్తున్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని, ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News