Monday, December 23, 2024

రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తాం: శివసేన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ 119 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. సోమవారం తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ త్వరలో హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. శివసేన పార్టీ అధినేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

చాలా మంది తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఏక్‌నాథ్ షిండే సమక్షంలో వివిధ పార్టీల కీలకమైన నాయకులు, మాజీ ఎమ్‌ఎల్‌ఎ లు ఎమ్‌ఎల్సీ లు మున్సిపల్ చైర్మెన్ లు వివిధ పార్టీల నేతలు చేరుతారని తెలిపారు. శాసన సభ ఎన్నికలలో ఈ సారి శివసేన పార్టీ సత్తా చాటుతుందని కాంగ్రెస్,బిజెపిలకు బలమైన పోటీ ఇస్తుందని ఈ సారి ఓవైసీ సోదరులను ఓడించేందుకు బలమైన కార్యచరణ సిద్ధం చేసినట్టు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News