Saturday, November 23, 2024

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరుతాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చే సిన వ్యాఖ్యలు తెలంగాణలో భగ్గుమన్నాయి. రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్తు సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్తు కార్పొరేట్ విద్యుత్తు సంస్థల లాభాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన నే పథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వబోమని రేవంత్ చెప్పినట్టు ఆయా పార్టీలు ఆరోపణలు చేశాయి. రేవం త్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఈసందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆపార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ మానిక్ రావ్ ఠాకూర్ మాట్లాడుతూ తాము ఎక్కడా ప్రభుత్వంలోకి వచ్చాక ఉచిత కరెంటు ఇవ్వబోమంటూ చెప్పలేదని పేర్కొన్నారు.

తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును కొనసాగిస్తామని, మరింత నాణ్యమైన విద్యుత్తు ఇస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నదనే విషయం అర్థమైన బిజెపి నాయకలు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నార ని ఆరోపించారు. ఇప్పటి వరకు రైతులకు కాం గ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏపార్టీ కూడా చేపట్టలేదని గుర్తు చేశారు. వరంగ ల్‌లో జరిగిన సభలో రాహుల్ గాంధీ మొట్టమొద ట రైతుల సంక్షేమం కోసమేరైతు డిక్లరేషన్ ప్రకటించారన్న విషయాన్ని ఠాకూర్ గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News