Sunday, December 22, 2024

ధోని రికార్డులు సిఎస్ కెను ముందుకు నడిపించేనా?

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఈ రోజు ఐపిఎల్ 2024 తాలూకు 39వ మ్యాచ్ చెన్నైలోని చేపాక్ లో ఉన్న ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగనున్నది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ జట్లు తలపడనున్నాయి. గత వారం ఈ రెండు టీములు లక్నోలో కూడా తలపడ్డాయి. ఓపెనింగ్ పార్టనర్స్ గా కెఎల్. రాహుల్, క్వింటన్ డీ కాక్ రికార్డు సృష్టించారు. దాంతో ఐపిఎల్ స్టాండింగ్ రేట్లలో లక్నో సూపర్ జయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది పాయింట్లతో నిలిచారు. చెన్నై సూపర్ కింగ్స్ కి ఈసారి స్వంత పిచ్ కావడం వల్ల విజయ పరంపరని కొనసాగించొచ్చు. టాస్ ఎవరు గెలుస్తారో… వారు బ్యాటింగ్ ఎంచుకుంటారో, బౌలింగ్ ఎంచుకుంటారో చూడాల్సి ఉంది. మ్యాచ్ రాత్రి 07.30 గంటలకు మొదలు కానున్నది. చూద్దాం ఏమి జరుగుతుందో.

జట్లలోని క్రికెటర్ల విషయానికొస్తే…

సిఎస్ కె ప్రిడిక్టెడ్ 11లో:  రచిన్ రవీంద్ర , అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), మోయిన్ అలీ, శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్. ధోని, శరద్ ఠాకుర్, తుషార్ దేశ్ పాండే, ముస్తఫిజుర్ రహ్మాన్, మథీశా పథ్రిరన ఉన్నారు. ఇంపాక్ట్ సబ్స్ గా  సమీర్ రిజ్వీ, దీపక్ ఛాహర్ ఉన్నారు.

లక్నో సూపర్ జయింట్స్ ప్రిడిక్టెడ్ 11లో: క్వింటన్ డీ కాక్, కెఎల్. రాహుల్( కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్ దత్ పదిక్కల్, నికోలస్ పూరన్, మార్కాస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృణాల్ పాండ్య, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మోహిసిన్ ఖాన్ ఉన్నారు. కాగా ఇంపాక్ట్ సబ్ గా యశ్ ఠాకుర్ ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News