- Advertisement -
తిరుమలగిరి(సాగర్): మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం నల్లగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరణి పోర్టల్ లోపాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. యాచారం, తిరుమలగిరి మండలాలను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. ధరణి ప్రక్షాళన విషయంలో ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. గతంలో భూమి లేకున్నా పాస్ పుస్తకాలు సృష్టించి ‘రైతుబంధు’ తీసుకున్నారన్నారు. నిజమైన రైతుకు ప్రయోజనం కలిగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు ప్రభుత్వ భూములను పంచుతామని ప్రకటించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 5000 ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్నారు. తెలంగాణలో త్వరలోనే ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రానున్నదన్నారు.అందరి భూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.
- Advertisement -