Thursday, January 23, 2025

5వేలకుపైగా పెళ్లి ప్రపోజల్స్… ప్రేమ పెళ్లి చేసుకుంటా: ప్రభాస్

- Advertisement -
- Advertisement -

Interview with Hero Prabhas
హైదరాబాద్: ప్రాంతీయంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్న తెలుగు సినీ నటుడు ప్రభాస్. అతడి పెళ్లి విషయం ఇప్పటికీ అందరికీ ఓ వీడని ప్రశ్న. టాలీవుడ్‌లో మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచ్‌లర్‌గా కూడా పేరుపడ్డాడు. ఇదిలావుండగా ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్‌కు పెళ్లి ప్రశ్నలు ఎదురయ్యాయి. కాగా ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో…‘ప్రేమ పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపాడు. అయితే అది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేనని తెలిపాడు. ‘బాహుబలి’ సినిమా తర్వాత తనకు 5వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపాడు. ‘డార్లింగ్’ అన్న పదాన్ని ఊతపదంగా వాడే ఈ నటుడు ‘ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే ఏంచేస్తారు?’ అని ఎదురు ప్రశ్నించారు. పెళ్లి చేసుకుంటానన్న ప్రభాస్ అది ఎప్పుడు అన్న దానిపై స్పష్టత ఇవ్వడంలేదు. ఇదిలావుండగా అతడు, పూజా హెగ్డేతో నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా మార్చి 11న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News