Sunday, September 8, 2024

బిసిల టికెట్‌ల కోసం అధిష్టానంతో కొట్లాడుతా: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఓసిల కంటే బిసిలకే ఎక్కువ టిక్కెట్‌లు కేటాయిస్తాం
సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాతే అభ్యర్థుల ప్రకటన
కాంగ్రెస్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదు
చిట్‌చాట్‌లో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  బిసి ఆశావహుల కోసం పిసిసి అధ్యక్షుడిగా తాను కొట్లాడుతానని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సర్వేలో ఓసీల కంటే బిసిలకు రెండు శాతం తక్కువగా ఉన్నా బిసిలకే ఎక్కువ టిక్కెట్‌లు ఇస్తామని ఆయన కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు. తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బిసిలు అడగడంలో తప్పులేదని, మిగతా పార్టీల కంటే తాము బిసిలకు ఎక్కువ సీట్లు ఇస్తామని ఆయన చెప్పారు. టిక్కెట్ల ప్రకటన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాతే ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.

టిక్కెట్ల ప్రకటన నాటికి చాలా మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరతారని ఆయన తెలిపారు. అధికారపార్టీ నుంచి తమ పార్టీలోకి నాయకులు వస్తున్నారంటేనే కాంగ్రెస్ బలం ఏంటో అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో 19 శాతం ఓట్లు అన్ డిసైడ్‌లో ఉన్నాయని, ఇందులో మెజారిటీ ఓటు షేర్ కాంగ్రెస్‌కు వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని ఆయన తెలిపారు. భయంతో ఉచిత సిలిండర్లు, సన్న బియ్యం రేషన్, రైతులకు పెన్షన్ లాంటి హామీలు ఇచ్చేందుకు వేరే పార్టీల వారు సిద్ధం అవుతున్నారని ఆయన విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News