Monday, December 23, 2024

మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్ముదులిపేసిన రాహుల్ గాంధీ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి వాయ్‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీని అనర్హుడిని చేశారు. గుజరాత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే లోక్‌సభ ఆయనపై అనర్హత వేటును వేసింది. అంతా 24 గంటల్లోగా ఆగమేఘాల మీద జరిగిపోయింది. ఎందుకు, ఏమిటి,ఎలా…అనేది కూడా ప్రశ్ననీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన మౌనాన్ని వీడారు. నేడొక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనర్హత వేటు పడ్డాక ఇదే ఆయన తొలి ప్రసంగం. ‘భారత దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది. అదానీకి బూటకపు(షెల్) కంపెనీలు ఉన్నాయి. వాటిలో రూ. 20,000 కోట్ల డబ్బు ఉంది. అవి ఎవరివి? అని నేను అడిగాను. పార్లమెంటులో కూడా విషయాన్ని లేవనెత్తాను. మోడీ గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే అదానీతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. దానిని నేను చాలా సార్లు ప్రశ్నించాను కూడా’ అన్నారు.

‘అదానీ అంశంపై నేను మాట్లాడుతున్నందున ప్రధాన మంత్రి జడుసుకున్నాడు. ఆయన కన్నుల్లో ఆ భయం నాకు కనిపిస్తుంటుంది. మోడీ, అదానీ లంకెపై నేను ప్రశ్నలతో నిలదీస్తూనే ఉంటాను. నా పోరాటం కొనసాగుతుంది’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

‘నాకు ఎందులోనూ ఇంట్రెస్ట్ లేదు. కేవలం నిజంలోనే ఉంది. నేను సత్యాన్నే పలుకుతాను. నేను అనర్హుడిని అయినా, అరెస్టయినా సత్యాన్నే పలుకుతాను. నాకు ఈ దేశం అన్నీ ఇచ్చింది’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ‘పార్లమెంటు నన్ను అనర్హుడిని చేసింది. కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను విదేశీయుల సాయం కోరానని కొందరు బిజెపి మంత్రులు అబద్ధపు ప్రచారం చేశారు. అయినా నేను వారిని నిలదీయడం ఆపను. పార్లమెంటులో నన్ను మాట్లాడనివ్వకుండా మైక్‌ను కట్ చేశారు. నేను స్పీకర్‌కు లేఖ రాశాను. కానీ ఏమి జరుగలేదు. నేను పార్లమెంటులో ఉన్నా లేకున్నా నా పని చేస్తాను’ అని ఆయన వివరణ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News