Wednesday, January 22, 2025

గెలిస్తే బ్రహ్మచారులకు పెళ్లిళ్లు జరిపిస్తా

- Advertisement -
- Advertisement -

శంభాజీనగర్: మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీడ్ జిల్లాలోని పర్టీ నుంచి పోటీచేస్తున్న ఎన్ సిపి (ఎస్ పి) అభ్యర్థి రాజే సాహేబ్ దేశ్ ముఖ్ విచిత్రమైన హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మచారులకు వధువులు దొరకక పెళ్లిళ్లు చేసుకోవడం లేదని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి ఎన్ సి పి(అజిత్ పవార్) పార్టీ నేత, వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేను విమర్శించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

‘‘నేను బ్రహ్మచారులకు పెళ్లిళ్లు జరిపిస్తా. యువతకు ఉపాధి కల్పిస్తా. అమ్మాయిని ఇచ్చేప్పుడు యువకుడికి ఉద్యోగం/వ్యాపారం ఉందా? అని అడుగుతారు. కానీ మంత్రి జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. దాంతో బ్రహ్మచారులకు ఉద్యోగాలు దొరకక పెళ్లిళ్లు కావడం లేదు’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి. పోటీ తీవ్రంగా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News