Monday, December 23, 2024

ముందస్తు ఎన్నికలకు వెళ్లుతా

- Advertisement -
- Advertisement -

Will go to early elections: Imran Khan

అవిశ్వాస కీలక దశలో ఇమ్రాన్
రాజీనామాకు దిగేది లేదు
సైన్యం మూడు ఆప్షన్లు ఇచ్చింది

ఇస్లామాబాద్ : ప్రస్తుత తరుణంలో దేశంలోని ‘ వ్యవస్థ’ (ఎస్టాబ్లిష్‌మెంట్ )తనకు మూడు మార్గాలను ఎంచుకునే అవకాశం ఇచ్చిందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. రాజీనామా లేదా బలపరీక్షను ఎదుర్కోవడం లేదా ఎన్నికలకు వెళ్లడం మార్గాలు తమ ముందు ఉన్నాయని శనివారం ఇమ్రాన్ చెప్పారు ఈ ఎస్టాబ్లిష్‌మెంట్ గురించి ఆయన వివరణ ఇవ్వలేదు. ఇది దేనికి సంబంధించినదనేది చెప్పలేదు. అయితే సైన్యాన్ని ఉద్ధేశించే ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టం అయింది. ప్రధాని ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న దశలోనే దేశ సైన్యం ఉన్నత స్థాయిలో క్రమేపీ భద్రతా, విదేశాంగ విధానాలను అత్యధిక స్థాయిలో తన అదుపులోకి తీసుకొంటోంది. ఈ దశలో ప్రధాని ఇమ్రాన్ స్పందించారు. తనకు సంబంధించినంత వరకూ ఎన్నికలకు వెళ్లడం మంచిదన్పిస్తోందని, అయితే రెండు మూడు మార్గాలలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చునని ఎస్టాబిష్‌మెంట్ తనకు సూచనలు చేసిందని ఇమ్రాన్ తెలిపారు.

తాను రాజీనామా గురించి ఎప్పుడూ ఆలోచించలేదని స్పష్టం చేశారు. ఫిరాయింపుదార్లతో ప్రభుత్వం నడిపించడం భావ్యం కాదని తాను భావిస్తున్నానని అన్నారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే దేశ స్ధిరత్వానికి ఎన్నికలకు వెళ్లడం ఉత్తమమని అన్పిస్తోందని అన్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదని తన ఆలోచన అని తెలిపారు.తమ తదుపరి వ్యూహాన్ని పరిస్థితిని బట్టి ఖరారు చేసుకుంటామని అన్నారు. ప్రతిపక్ష పిఎంఎల్ ఎన్, పిపిపిలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని, వారి వైఖరి వారు ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన విధానాలతో ఇప్పుడు కొన్ని విదేశీ శక్తులు ఈ దేశాన్ని శాసిస్తున్నాయని, పాకిస్థాన్‌లో అధికార మార్పిడి జరిగితీరాలని లేకపోతే ముప్పు ఏర్పడుతుందని పేర్కొంటున్నాయని ఇమ్రాన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News