Saturday, November 23, 2024

స్కామ్ నిరూపిస్తే ఉరేసుకుంటా

- Advertisement -
- Advertisement -

Will hanging myself if proven scam:Abhishek Banerjee

కేంద్రానికి టిఎంసి ఎంపి సవాలు

కోల్‌కతా : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే ఉరి వేసుకుని చనిపోతానని టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ సవాలు విసిరారు. బొగ్గు స్కామ్‌కు సంబధించి ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు సమన్లు పంపించింది. దీనికి హాజరయ్యేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే ముందు ఆదివారం ఆయన ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ఏ కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా అభియోగాలను రుజువు చేయగలదా? అని ప్రశ్నించారు. ఒకవేళ వారు నిజమేనని నిర్థారిస్తే తాను ఉరివేసుకుంటానని తెలిపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం చెందిన బిజెపి ఈ విధంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని, ఇందుకు చట్టపరమైన అధికారిక సంస్థలను వాడుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News