Monday, December 23, 2024

పెళ్లి కాకపోయినా సరే…పిల్లల్ని కంటాను: మృణాల్ ఠాకుర్

- Advertisement -
- Advertisement -

 

Mrinal Thakur

హైదరాబాద్: మంచి ఒడ్డు, పొడుగు, అందం అన్నీ కలబోసిన ఫిగర్ నటి మృణాల్ ఠాకుర్ ది. ఆమె ఇటీవల నటించిన తెలుగు చిత్రం ‘సీతారామం’. ఆ చిత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది కూడా. ఆమెకు కొత్త ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ మధ్య ఆమె ఓ జాతీయ మీడియాతో ముచ్చటిస్తూ ‘‘పెళ్లి కాకపోయినా సరే…పిల్లల్ని కంటాను’’అంటూ బోల్డ్ కామెంట్ చేసేసింది. ‘‘నేను నాకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. అతడు నా వృత్తిని గౌరవించాలి. నాకు మంచి రక్షణ కల్పించే వ్యక్తిలా ఉండాలి. అలాంటి వ్యక్తి దొరకడం అరుదు. అయితే దొరికితే మాత్రం పెళ్లి చేసేసుకుంటాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ‘‘నాకు పెళ్లిపై పెద్ద ఆశలు లేకపోయినా,  పిల్లలు ఉండాలన్న కోరిక మాత్రం బాగా ఉంది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశ’’ అంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News