Wednesday, January 22, 2025

నేను గెలిస్తే ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేస్తా: మల్లికార్జున్ ఖర్గే

- Advertisement -
- Advertisement -

Mallikarjuna Kharge

హైదరాబాద్: కాంగ్రెస్‌కు యువ నేత నాయకత్వం వహించాలన్న సూచనల మధ్య, ఎన్నికల్లో గెలిస్తే 50 ఏళ్లలోపు వారికి 50 శాతం పార్టీ పదవులు ఇవ్వాలనే ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రతిపాదనను అమలు చేస్తానని ఏఐసిసి అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే శనివారం తెలిపారు.“ఇది కాంగ్రెస్‌లో పదవి కోసం కాదు. పార్టీ వదిలి వెళ్లిన చాలా మంది ఈడి, సిబిఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ భయంతో వెళ్లిపోయారు. యువకుల కోసం, నేను చెప్పినట్లు, ఉదయపూర్ డిక్లరేషన్‌లో, మేము 50 ఏళ్లలోపు వారికి 50 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చాము, దానిని నేను అమలు చేస్తాను. ప్రతి ఒక్కరూ నన్ను పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని కోరుతున్నప్పుడు, నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని ఆయన ఇక్కడ విలేకరులతో అన్నారు.75 ఏళ్ల వయసున్న సోనియాగాంధీ స్థానంలో 80 ఏళ్ల ఖర్గే వస్తున్నారని, కాంగ్రెస్‌కు యువ నేత నాయకత్వం వహించాలనే వాదనపై అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.

ఏఐసిసి  అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఖర్గే హైదరాబాద్ వచ్చారు. తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌ తన పేరును భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)గా మార్చుకుని జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించుకోవడంపై ప్రశ్నించగా, పలు ప్రాంతీయ పార్టీలు తమకు ‘ఆల్‌ ఇండియా’ ట్యాగ్‌ ఇచ్చాయని అన్నారు.ఉదయపూర్ డిక్లరేషన్‌ను అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. తన పర్యటన సందర్భంగా పిసిసి సభ్యులను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News