జనసేన పార్టీ ప్రస్తుతం బిజెపితో పొత్తులో ఉంది. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్‌కల్యాణ్‌కు తెలంగాణ యువతలో పెద్దయెత్తున అభిమానులున్నారు. పవన్ చెప్పింది విని వీరిలో ఎంతమంది జనసేనకు ఓటేస్తారన్నది ప్రశ్నార్థకమే అయినా, పడే ఓట్లు మాత్రం సాధారణంగా మూడు ప్రధాన పార్టీల ఓట్లనూ సమానంగా చీల్చవచ్చు.
సమర్థుడైన పోలీసు అధికారిగా, గురుకులాల కార్యదర్శిగా పేరు తెచ్చుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తన సర్వీసుకు రాజీనామా చేసి బిఎస్‌పి పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలలో బిఎస్‌పి సానుభూతిపరులు ఉంటారు. ఇప్పటిదాకా ఈ వర్గాలు అయితే అధికార బిఆర్‌ఎస్‌కో లేదంటే కాంగ్రెస్ పార్టీకో ఓటు వేస్తూ వస్తున్నాయి. అయితే ఈసారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా పోటీ చేయడంతో పాటు మెజారిటీ నియోజకవర్గాలలో తమ పార్టీ తరపున అభ్యర్థులను ఎన్నికలో పోటీ చేయిస్తున్నారు.
ఈఎన్నికలలో బిఎస్‌పి పోటీ చేసే సెగ్మెంట్లలో ఎవరి నష్టం జరుగుతుంది..? ఎవరికి లాభం జరుగుందో అని ప్రధాన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విశ్లేషించుకుంటున్నారు. సిపిఐ, సిపిఐ(ఎం) ఉనికిని తీసివేయలేం. ఒకప్పుడు ప్రజా ఉద్యమాలతో ఓ వెలుగు వెలిగిన ఈ పార్టీలు ప్రస్తుతం కొన్ని పరిమిత స్థానాలలోనే పోటీ చేస్తున్నప్పటికీ, ఇతర స్థానాలలో గెలుపును ప్రభావితం చేయగలిగే పరిస్థితి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.