Thursday, December 19, 2024

బిఆర్ఎస్ తో పొత్తు ఉండదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైందనీ, కాంగ్రెస్ కూ అదే గతి పడుతుందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ బీజేపీ పోటీ చేస్తుందన్నారు. కేంద్రంలో మరొకసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని చెప్పారు. ఈసారి హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News