Sunday, January 19, 2025

నేను బతికినంత కాలం సిఎఎ అమలు కానివ్వను : మమతాబెనర్జీ

- Advertisement -
- Advertisement -

రాయిగంజ్ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) బీజేపీ ప్రభుత్వం తెరపైకి తీసుకురావడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను జీవించి ఉన్నంతకాలం ఆ చట్టాన్ని పశ్చిమబెంగాల్‌లో అమలు లోకి తీసుకురానివ్వబోనని స్పష్టం చేశారు.ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ దీన్ని అవకాశవాదంగా లేవనెత్తుతోందని విమర్శించారు. అంతకు ముందు రోజు వ్యక్తం చేసిన అభిప్రాయాలనే మళ్లీ ఇప్పుడు ఆమె వ్యక్తం చేశారు. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో రాయిగంజ్‌లో ప్రజాపంపిణీ కార్యక్రమం సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడారు. కేంద్ర మంత్రి , బీజేపీ నేత శాంతను ఠాకూర్ వారం రోజుల్లో దేశం మొత్తం మీద సిఎఎ అమలు చేసి

తీరుతామని ప్రకటించిన నేపథ్యంలో మమతాబెనర్జీ దీనిపై ధ్వజమెత్తారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నట్టు సరిహద్దు భద్రతా దళాల నుంచి వస్తున్న వార్తలను ఉద్దేశిస్తూ అలాంటి ఎన్‌సిఆర్ ( నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ) ఉచ్చులో పడవద్దని, అటువంటి గుర్తింపు కార్డులను అంగీకరించరాదని మమత హెచ్చరించారు. సరిహద్దుల్లోని పౌర సమాజాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పశ్చిమబెంగాల్ లోని కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ మధ్య పొత్తు కుదురుతోందని , ఆ కూటమి నుంచి వచ్చే ముప్పును ప్రజలు టీఎంసీ బ్యానర్ కింద సంఘీభావంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం లోని ప్రజల హక్కుల కోసం టిఎంసి ఒక్కటే పోరాడుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News