- Advertisement -
అమెరికాకు తెలిపిన చైనా
బీజింగ్ : స్వాతంత్య్రం ప్రకటించుకుంటే తైవాన్‌పై యుద్ధానికి వెనుకాడేది లేదని చైనా హెచ్చరించింది. చైనా రక్షణ మంత్రిజనరల్ వీ ఫెంఘే, అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ మధ్య తొలి ముఖాముఖి భేటీ సందర్భంగా శుక్రవారం తైవాన్ ప్రస్తావన వచ్చింది. తైవాన్ అతిగా వ్యవహరిస్తే ఆ దేశాన్ని చితకబాదుడే అని రక్షణ మంత్రి స్పందించారని వెల్లడైంది. తైవాన్ స్వాతంత్య్రం దిశలో ఎటువంటి చర్యకు పాల్పడ్డా తమ ప్రతిచర్య తప్పదని, ఇది తీవ్రంగానే ఉంటుందని చైనా తెలిపింది. తైవాన్ చైనాకు చెందిన తైవాన్. తమ మాతృభూమి పునరేకీకరణను పరిరక్షించుకుని తీరుతాం అన్నారు. తైవాన్‌ను తురుఫు ముక్కగా వాడుకుని చైనాను నిలువరించాలనుకుంటే ఆ పప్పులు ఎవరికైనా ఉడకవని పరోక్షంగా అమెరికా, జపాన్‌లకు చురకలు పెట్టారు.
- Advertisement -