Thursday, December 12, 2024

మహారాష్ట్రలో బిగ్‌ట్విస్ట్.. యూబీటీ ఎమ్‌ఎల్‌ఎల సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో “మహాయుతి” ప్రభుత్వం కొలువుతీరడం, మూడు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శనివారం ప్రారంభమైన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘మహావికాస్ అఘాడీ ’ కూటమి ఎమ్‌ఎల్‌ఎలు శనివారం జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు. శివసేన (యుబిటి) నేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే ఈ విషయాన్ని ప్రకటించారు. ఎమ్‌ఎల్‌ఎలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా పలువురు శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. “ఎంవీఎలో భాగమైన శివసేన ఎమ్‌ఎల్‌ఎలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం లేదు. ఈవిఎంలపై మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరు. ప్రజలిచ్చిన తీర్పే అయితే వారంతా సంతోషంగా ఉండేవారు. అలా జరగలేనందునే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదు” అని థాకరే చెప్పారు.

ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ఆరోపించారు. ఆదిత్య చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సిఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ స్పందించారు. ఆయన చేసిన ఆరోపణలను ఖండించారు. “ ప్రతిపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలకు తావు లేదు. అవసరమైతే న్యాయస్థానాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలి ” అని సూచించారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లను సొంతం చేసుకున్న మహాయుతి కూటమి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి బాధ్యలు అప్పగించింది. రాష్ట్రంలో ప్రస్తుతం శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. స్పీకర్‌గా బాధ్యతలు ఎవరు స్వీకరించనున్నారనే అంశంపైచర్చలు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో నూతన స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ సీనియర్ ఎమ్‌ఎల్‌ఎ కాళిదాస్ కొలాంబ్కర్‌ను ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం నాడు నియమించారు. తక్కిన 287 మంది ఎమ్‌ఎల్‌ఎలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. డిసెంబర్ 9న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై‘ ట్రస్ట్ ఓట్ ’, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News