- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: నూతన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను నియమిస్తే ఆయన సమక్షంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు. తెలంగాణ అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చిన తర్వాతే ఆయన ఛాంబర్‌లో తాను ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు.
రాజాసింగ్ 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆయన ప్రొటెమ్ స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పట్లో ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ వ్యవహరించగా… దేశం, ధర్మం పట్ల గౌరవం లేని పార్టీకి ఇచ్చారని ఆరోపించారు. దీంతో ముంతాజ్ ఖాన్ సమక్షంలో కాకుండా పూర్తి స్థాయి స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాతే స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.
- Advertisement -