Monday, January 20, 2025

స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటా: కాంగ్రెస్ మాజీ ఎంపి రేణుకా చౌదరి

- Advertisement -
- Advertisement -

టికెట్ల కేటాయింపులో కమ్మ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తా
తమ వద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బి, రెండూ ఉన్నాయి

మనతెలంగాణ/హైదరాబాద్:  ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ నేడు, రేపు మరోసారి సమావేశం కానుంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశంపై కాంగ్రెస్ మాజీ ఎంపి నేత రేణుకా చౌదరి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ సమావేశాల్లో తాను పాల్గొంటానన్నారు. టికెట్ల కేటాయింపులో కమ్మ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమ వద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బి, రెండూ ఉన్నాయని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News