Monday, January 20, 2025

జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: కేటీఆర్

- Advertisement -
- Advertisement -

కొత్త జిల్లాలు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని, అదే జరిగితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. జహీరాబాద్ లోక్ సభ స్థానంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిషన్ వేస్తామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులైందని, ఈ నెల రోజుల్లోనే అప్రతిష్ఠను మూటగట్టుకుందని కేటీఆర్ అన్నారు. అప్పులను బూచిగా చూపించి, తాము ఇచ్చిన హామీలనుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అటువంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుందని, ఫలితాలు బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News