Monday, December 23, 2024

మ్యాజిక్‌లు చేసైనా జోధ్‌పూర్‌ను అభివృద్ధి చేస్తా: సిఎం అశోక్ గెహ్లాట్

- Advertisement -
- Advertisement -

జోధ్‌పూర్: మ్యాజిక్ చేసైనా డబ్బులు సంపాదిస్తా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జోధ్‌పూర్ ప్రజలకు తాను ప్రథమ సేవకుడి అని వ్యాఖ్యానించారు. జోధ్‌పూర్ అభివద్ధి కోసం మ్యాజిక్‌లైనా చేస్తాను అని అన్నారు. అశోక్ గెహ్లాట్ ప్రొఫెషనల్ మెజీషియన్ల కుటుంబంలో జన్మించారు. 15వ శతాబ్దానికి చెందిన మెహ్రాన్ ఘర్ కోటను సందర్భించే పర్యాటకుల సౌకర్యార్థం కోసం కొత్తగా నిర్మించిన ‘రావు జోధా మార్గ్’ ప్రారంభోత్సవంలో గెహ్లాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 42 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతం నుంచి నేను మొదటిసారిగా ఎంపిగా ఎన్నికయ్యానని, అప్పుడు జోధ్ పూర్ కు నీళ్లు లేవు.. రైళ్లు లేవు.

కానీ ఈ రోజు నీటి సరఫరా, విద్యుత్, రైళ్లు, రోడ్లు, విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు అన్నీ సమకూర్చాను అంటూ చెప్పుకొచ్చారు. జోధ్‌పుర్‌పై ఎవరైనా అధ్యయనం చేస్తే.. అభివృద్ధి అంటే ఏంటో కచ్చితంగా తెలుసుకుంటారని అన్నారు. ఇలాంటి గొప్ప పట్టణానికి యునెస్కో వారసత్వ హోదా ఇవ్వాలని ఈ సందర్భంగా సిఎం గెహ్లాట్ డిమాండ్ చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇంకా కృషి చేస్తాను..నిధుల కోసం అవసరమైతే మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చి అయినా సరే డబ్బులు సంపాదిస్తా.. అంతేగానీ జోధ్‌పుర్ ప్రజలను నిరాశపరచను అంటూ స్పష్టంచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News