టీపీసీసీ ఆధ్వర్యంలో రేపు(గురువారం) ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ.. రేపు ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..ఈడీ ఛార్జిషీట్లలో సోనియా, రాహుల్ పేర్లను కక్ష పూరితంగా చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులను నిరసిస్తూ ధర్నా ఉంటుందని మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు.
కాగా, నిన్న నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన మనిలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మంగళవారం చార్జీషీటు దాఖలు చేసింది. కాంగ్రెస్ ఓవర్ సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా, సుమన్ దూబేతో సహా మరికొందరు ముఖ్యనేతల పేర్లను కూడా చార్జిషీటులో పేర్కొంది. సోనియా, రాహుల్, ఇతర నాయకులు, యంగ్ ఇండియన్ అనే ప్రైవేటు కంపెనీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు మనీలాండరింగ్ కు పాల్పడ్డారని, నేరపూరిత కుట్ర పన్నారని ఫిర్యాదులో ఈడీ ఆరోపించింది. ఏప్రిల్ 25న ఈ కేసు తదుపరి విచారణను చేపట్టనున్నట్లు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు తెలిపింది.